Andhra Pradesh: అది ఫేక్ వీడియో.. టీడీపీ సోషల్ మీడియా విభాగం నీచాతి నీచం: వైసీపీ

  • ఏపీ రాజధానిపై రగడ
  • వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్
  • తమిళనాడు వీడియోను ఏపీతో ముడిపెడుతున్నారంటూ ఆగ్రహం

ఏపీ రాజధాని అంశం తీవ్రస్థాయిలో రగులుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. తాజాగా, టీడీపీ సోషల్ మీడియా విభాగంపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. నారా లోకేశ్ ఆధ్వర్యంలో నడుస్తున్న టీడీపీ సోషల్ మీడియా విభాగం నీచాతినీచంగా మారిందని ఆరోపించింది.

అంతేగాకుండా, ఓ వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా, కింద ఉన్న వాళ్లు అతడ్ని వారిస్తున్న ఓ వీడియోను కూడా వైసీపీ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆ వీడియోలో ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియోను పచ్చ మీడియా ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ రాజధాని కోసం జరిగిన సంఘటన అంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

More Telugu News