భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను మరచిపోయారా?: ఎంపీ గల్లా జయదేవ్

10-01-2020 Fri 13:14
  • పూజలు చేయడానికి వెళుతున్నవారిని అడ్డుకోవడం తగదు
  • మహిళలపై పోలీసుల చర్య హేయమైనది 
  • ఈ చర్యతో పోలీసులు స్థాయిని దిగజార్చుకున్నారు

అమరావతి ప్రాంతంలో మహిళలపై పోలీసుల లాఠీచార్జిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఖండించారు. రైతులు, మహిళలు చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసులు లాఠీలతో అడ్డుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు.

‘కనక దుర్గ దేవాలయంలో పూజలు చేయడానికి వెళుతున్న అమరావతి రాజధాని ప్రాంత రైతులు, మహిళలపై హేయమైన రీతిలో చర్యలు చేపట్టి తమ స్థాయిని పోలీసులు దిగజార్చుకున్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛను వీరు మరచిపోయినట్టున్నారు’ అని ట్వీట్ చేశారు.