టైమ్ దగ్గరపడింది... రావాలి జగన్... కావాలి జగన్: బుద్ధా వెంకన్న

10-01-2020 Fri 12:41
  • జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్నారు
  • విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు
  • ట్విట్టర్ లో సెటైర్లు వేసిన బుద్ధా వెంకన్న

వైఎస్ జగన్ కు టైమ్ దగ్గర పడిందని 'రావాలి జగన్... కావాలి జగన్' అని జైలు గోడలు పిలుస్తున్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "జగన్ మోహన్ రెడ్డి గారూ... మీరు కోర్టుకి హాజరయ్యి జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్ లో చాలా కష్టపడుతున్నారు. 60 లక్షల ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఖర్చు ఎంత చూపిస్తారు? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్... కావాలి జగన్ అని" అంటూ సెటైర్లు వేశారు. కాగా, ఈ ఉదయం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరైన జగన్, విచారణ అనంతరం నేరుగా బేగంపేటకు వెళ్లి, గన్నవరంకు బయలుదేరి వెళ్లారు.