నీ పతనం కూడా మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు: కేశినేని నాని

10-01-2020 Fri 12:39
  • ప్రజాస్వామ్యాన్ని జగన్ ఖూనీ చేస్తున్నారు
  • రాష్ట్రంలో మిలిటరీ పాలన చేస్తున్నారు
  • రైతుల రక్తంతో అమరావతి ప్రాంతం ఎర్రగా మారింది

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులు, జేఏసీ ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేస్తూ రాష్ట్రంలో మిలిటరీ పాలన చేస్తున్నారని విమర్శించారు.

నియంతృత్వ ధోరణి కలిగిన ఎందరో నియంతలు మట్టిలో కలిసిపోయారని... నీ పతనం కూడా కూడా మొదలైంది జగన్మోహన్ రెడ్డిగారూ అంటూ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతుల నుంచి చిందుతున్న రక్తంతో అమరావతి ప్రాంతం ఎర్రగా మారిందని అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న నిరసనకారులపై పోలీసుల అండతో ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.