గుడికి వెళుతూంటే మహిళలను అరెస్టు చేస్తారా?: చంద్రబాబునాయుడు

10-01-2020 Fri 12:16
  • గ్రామ దేవతలను కూడా పూజించుకోనీయరా?
  • గుడులకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలా?
  • గుడికి వెళ్లకపోతే మీలాగా కోర్టుకు వెళ్లమంటారా?

అమరావతి ప్రాంత మహిళలు గుడికి వెళుతూంటే వారిపై పోలీసులు దాడి చేయడం అమానుషమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈమేరకు ప్రభుత్వ తీరుని దుయ్యబడుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

‘గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటి? వాళ్ల గ్రామ దేవతలని పూజించుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా? శుక్రవారం గుడికి వెళ్లకపోతే మీలాగా కోర్టుకు వెళ్లమంటారా? రైతులు గుడికే వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా?’ అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.