మహేశ్ బాబు ఇంటి ముందు ఏపీ విద్యార్థుల నిరసన... పోలీసుల బందోబస్తు!

10-01-2020 Fri 12:16
  • అమరావతికి మద్దతివ్వాలి
  • మహేశ్ స్పందించాలంటూ నిరసన 
  • చెదరగొట్టిన పోలీసులు

హైదరాబాదులోని టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఇంటి ఎదుట కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు, హుటాహుటిన చేరుకుని వారిని చెదరగొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, డిమాండ్ చేస్తున్న ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితికి చెందిన కొందరు, మహేశ్ బాబు ఈ విషయంలో వెంటనే స్పందించాలని కోరారు.

అమరావతిపై సినిమా పరిశ్రమ స్పందించాలని, హీరోలు తమకు మద్దతుగా నిలవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, ఈ నిరసన జరిగే సమయంలో మహేశ్ బాబు ఇంట్లో ఉన్నారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. రేపు ఆయన నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.