తెలుగు రాష్ట్రాల్లో 'దర్బార్' తొలిరోజు వసూళ్లు

10-01-2020 Fri 11:33
  • రజనీ తాజా చిత్రంగా వచ్చిన 'దర్బార్'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  •  ఓవర్సీస్ లోను అదే దూకుడు

కథ ఏదైనా .. పాత్ర ఏదైనా దానికి తనదైన స్టైల్ ను జోడించడం రజనీకాంత్ ప్రత్యేకత. అలాంటి రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన 'దర్బార్' నిన్ననే భారీస్థాయిలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులోను విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

వసూళ్ల పరంగా తమిళనాట కొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ సినిమా, తెలుగులోను మంచి వసూళ్లనే రాబడుతోంది. తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7.5 కోట్ల గ్రాస్ ను .. 4.5 కోట్ల షేర్ ను సాధించింది. ఇవి చెప్పుకోదగిన వసూళ్లేనని అంటున్నారు. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. తెలుగు వెర్షన్ సంగతి అటుంచితే, తమిళనాట మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయమనే బలమైన నమ్మకాన్ని రజనీకాంత్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.