Jagan: జగన్ కేసు విచారణ.. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కు ఆదేశించిన న్యాయమూర్తి

  • గత వారం నుంచి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా విచారిస్తున్న కోర్టు
  • అత్యాచారం, దేశభద్రత తదితర కేసులను ఈ పద్ధతిలో విచారిస్తారు
  • క్విడ్ ప్రోకో కేసును ఈ విధంగా విచారణ జరపడంపై చర్చ

అక్రమాస్తుల కేసు విచారణకు గాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ (కేసుకు సంబంధం లేని ఇతరులు, మీడియా వంటి వారిని కోర్టు హాలులోకి అనుమతించరు) కు న్యాయమూర్తి ఆదేశించారు. గత వారం నుంచి కూడా కేసు విచారణ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారానే జరుగుతోంది. అత్యాచారానికి సంబంధించిన కేసులు, దేశ భద్రతకు సంబంధించిన కేసులు, రాజ్యాంగానికి సంబంధించిన కేసులు వంటి వాటిని మాత్రమే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా విచారిస్తారు. ఈ నేపథ్యంలో, జగన్ కేసు విచారణను ఈ పద్ధతిలో విచారించాలనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

క్విడ్ ప్రోకోకు సంబంధించిన ఈ కేసులో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కు ఎందుకు అనుమతించారనే చర్చ జరుగుతోంది. ప్రజాప్రయోజనాలు, అక్రమ ఆదాయాలు, కోట్లాది రూపాయల ఆర్థిక ప్రయోజనాలు, భిన్న కంపెనీల లావాదేవీలు తదితర అంశాలతో ముడిపడిన కేసు కావడం వల్లే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కు న్యాయమూర్తి ఆదేశించారని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News