చెన్నైలో తొలి రోజున దుమ్మురేపేసిన 'దర్బార్'

10-01-2020 Fri 10:34
  • నిన్ననే విడుదలైన 'దర్బార్'
  • తమిళనాట హిట్ టాక్ 
  • తెలుగులోను భారీ ఓపెనింగ్స్ 

రజనీకాంత్ .. మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన 'దర్బార్' భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార .. సునీల్ శెట్టి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రజనీకి గల క్రేజ్ కారణంగా తమిళనాట ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.

ముఖ్యంగా వసూళ్ల పరంగా నిన్న ఈ సినిమా చెన్నైలో దుమ్మురేపేసింది. తొలి రోజున 2.27 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇంతవరకూ చెన్నైలో అత్యధిక వసూళ్లను సాధించిన మొదటి చిత్రంగా' 2.ఓ' వుంది. రెండవ స్థానంలో విజయ్ 'సర్కార్' ఉండగా, మూడవ స్థానంలో 'దర్బార్' నిలిచింది. తమిళనాట రజనీకి పోటీ ఇచ్చే సినిమాలేవీ దగ్గరలో లేవు. అందువలన ఈ వీకెండ్ లోను .. పండుగ రోజుల్లోను వసూళ్లు ఒక రేంజ్ లో ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.