ఇలా జోలె పట్టి అడుక్కోవడం ఏమిటండీ?: విజయసాయి రెడ్డి!

10-01-2020 Fri 09:47
  • మీ బినామీల ఆస్తులే లక్ష కోట్లపైగా ఉన్నాయి
  • మీరివ్వకుండా జనంపై పడి జోలె చాపడం ఏమిటి
  • ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయి

గంటల వ్యవధిలో కోట్ల రూపాయలు పోగు చేయగల స్తోమత ఉన్న వాళ్లు, జనాల ముందు జోలె పట్టి చాపడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొన్న మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయి. గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా. మీరివ్వకుండా జనం మీద పడి జోలె చాపడం ఏమిటి చంద్రబాబూ? తుపాకులు కొని సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?" అని అన్నారు.

 కాగా, నిన్న అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోలె పట్టి విరాళాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా విజయసాయి ఈ వ్యాఖ్యలు చేశారు.