బ్రేకింగ్... విజయమ్మ, షర్మిల, కొండా దంపతులు కోర్టుకు రావడం లేదు!

10-01-2020 Fri 09:11
  • 2012 నాటి కేసులో సమన్లు
  • ఇంకా నిందితులకు అందని కోర్టు వారెంట్లు
  • హాజరు కాబోవడం లేదన్న సురేఖ

2012లో నాటి వరంగల్ జిల్లా పరకాలలో అనుమతి తీసుకోకుండా బహిరంగ సభను నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నేడు నిందితులు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు కొండా మురళీ, సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరు కావడం లేదు. వారికి కోర్టు జారీ చేసిన సమన్లు ఇంకా అందలేదని తెలుస్తోంది.

సమన్లు జారీ అయినా, అధికారికంగా వారికి ఇంకా అవి చేరలేదు. ఈ కారణంతో వారెవరూ నేడు కోర్టుకు హాజరు కావడం లేదని సమాచారం. ఈ విషయాన్ని కొండా సురేఖ ఈ ఉదయం తెలిపారు. తమకు ఎటువంటి సమన్లూ రాలేదని, మీడియాలో వార్తలు వచ్చిన తరువాత, తాను వివరాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు. కోర్టుకు తాము వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మరింత సమాచారం వెలువడాల్సి వుంది.