'సరిలేరు మీకెవ్వరు' సార్... పేరు చెప్పకుండా పీవీపీ ఎద్దేవా!

10-01-2020 Fri 09:02
  • ఆంధ్రులను రోడ్డు మీద పడేశారు
  • హెరిటేజ్, జూబ్లీహిల్స్ భవనాలను ఇవ్వండి
  • వెనిస్ ను మించిన రాజధాని వస్తుంది

రూ. 5 వేల కోట్లను తగులబెట్టిందే కాకుండా, ఇప్పుడు తాను జోలెపట్టి, ఆంధ్రులను రోడ్డు మీద పడేశారని మాజీ సీఎం చంద్రబాబునాయుడు పేరును ప్రస్తావించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఐదువేల కోట్లు హారతి కర్పూరంలా తగలబెట్టారు. ఇంకా జోలె పట్టుకొని అడుక్కునేలా ప్రతి ఆంధ్రుడిని రోడ్డు మీద పడవేసారు. అదే జోలెలో మీ హెరిటేజ్ షేర్స్, జూబ్లీహిల్స్ భవనాలు కూడా దానమిస్తే, బెజవాడ, వెనిస్ ఏమిటి అంతకుమించిన  నగరాన్ని చేద్దాం. సరిలేరు మీకెవ్వరు సార్!" అని అన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండగా, మిశ్రమ స్పందన లభిస్తోంది.