విజయవాడ, విశాఖ స్టేషన్లకు వెళ్లకుండా... సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళానికి స్పెషల్ రైలు!

10-01-2020 Fri 08:27
  • 12న సాయంత్రం 5.50 గంటలకు రైలు
  • మరుసటి రోజు ఉదయం శ్రీకాకుళానికి
  • తిరిగి అదే రోజు వెనక్కు రానున్న సువిధ స్పెషల్ రైలు

పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ ప్రత్యేక సువిధ రైలును 12వ తేదీన నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైలు, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్ లకు వెళ్లదని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు. సికింద్రాబాద్ స్టేషన్ లో 12న సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరే రైలు (82712), 13వ తేదీ ఉదయం 8.55 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు చేరుతుందని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, 14 ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని పేర్కొంది.