సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

10-01-2020 Fri 07:27
  • ముద్దుగుమ్మకు బిర్యానీ పిచ్చి!
  • మహేశ్ మూడు నెలల గ్యాప్ 
  • శేఖర్ కమ్ముల సినిమా అప్ డేట్

 *  తనకు హైదరాబాదీ బిర్యానీ అంటే మహా పిచ్చి అని చెబుతోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'నేను షూటింగుల కోసం ఏ ఊర్లకు వెళ్లినా అక్కడి ప్రాంతీయ వంటకాలు రుచి చూస్తుంటాను. అయితే, హైదరాబాదీ బిర్యానీ అంటే మాత్రం తెగ పిచ్చి. మూడు పూటలా లాగించమన్నా లాగించేస్తాను. అంత ఇష్టం!" అని చెప్పింది.
*  తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని చేసిన హీరో మహేశ్ బాబు ఈ చిత్రం తర్వాత మూడు నెలల గ్యాప్ తీసుకుంటాడట. ఈ విషయాన్ని తనే తాజాగా వెల్లడించాడు. అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తాను నటించే చిత్రం షూటింగ్ మొదలవుతుందని మహేశ్ చెప్పాడు.
*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'లవ్ స్టోరీ' పేరిట రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.