ఇలా విడుదలైందో, లేదో.. ‘దర్బార్‌’కు అలా షాకిచ్చిన తమిళ్ రాకర్స్

10-01-2020 Fri 07:07
  • దర్బార్‌కూ తప్పని పైరసీ బెడద
  • భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దర్బార్’
  • గంటల వ్యవధిలోనే పైరసీ చేసిన తమిళ రాకర్స్

భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘దర్బార్‌’కు ‘తమిళ రాకర్స్’ షాకిచ్చారు. సినిమా విడుదల కాగానే పైరసీ చేసి ఆన్‌లైన్‌లో లీక్ చేసే ‘తమిళ రాకర్స్’ సినిమా విడుదలై తొలి ఆట పూర్తి కాగానే పైరసీ చేసేశారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. సాధారణంగా ఏ భాషలో విడుదలైన సినిమా అయినా వదిలిపెట్టని వీరు.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘దర్బార్’ను కూడా విడిచిపెట్టలేదు.

పైరసీ చేయడంలో సిద్ధహస్తులైన తమిళ రాకర్స్.. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ భాషలో సినిమా విడుదలైనా వెంటనే పైరసీ చేసేస్తుంటారు. తాజాగా రజనీ సినిమాను లీక్ చేసి నిర్మాతలకు షాకిచ్చారు. కాగా, ఈ సినిమాలో రజనీ డ్యూయల్ రోల్ పోషించారు. పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా, సామాజిక కార్యకర్తగా రెండు పాత్రల్లో ఒదిగిపోయారు.