ఒంగోలులో ఈటీవీ రిపోర్టర్ మృతికి సంతాపం తెలియజేసిన నారా లోకేశ్

09-01-2020 Thu 22:13
  • ఒంగోలులో మీడియా ప్రతినిధి సందీప్ మృతి
  • సందీప్ మరణం తనను బాధించిందన్న లోకేశ్
  • ట్విట్టర్ లో ఆవేదన

ఒంగోలులో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీని కవర్ చేస్తుండగా ఈటీవీ రిపోర్టర్ సందీప్ మరణించడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. సందీప్ మరణం తనను ఎంతగానో బాధించిందని లోకేశ్ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. సందీప్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు.