Hyderabad: తెలుగు భాష అమ్మఒడి లాంటిది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం
  • భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
  • మన కట్టూబొట్టు మరచిపోకూడదు

హైదరాబాద్ లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు నిర్వహించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడి కుటుంబసభ్యులు, ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని, మన కట్టూబొట్టు మరచిపోకూడదని సూచించారు. తెలుగు భాష అమ్మఒడి లాంటిదని, దీనిని అందరూ కాపాడుకోవాలని అన్నారు.
 
దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు ఒక బ్రాండ్: గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ, తెలుగు సంప్రదాయం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడుపై ప్రశంసలు కురిపించారు. దేశ రాజకీయాల్లో వెంకయ్యనాయుడు ఒక బ్రాండ్ అని, ఆయన సేవలు సమాజ హితానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.

More Telugu News