ఏపీ రాజధానిగా అమరావతిని మించింది లేదు!: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

09-01-2020 Thu 21:11
  • ఏపీ రాజధాని అంశంపై స్పందించిన జైరాం రమేశ్
  • మూడు రాజధానులు సాధ్యం కాదని వెల్లడి
  • అప్పట్లో గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలనుకున్నా సాధ్యం కాలేదు

కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. 1953లో కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలనుకున్నా సాధ్యం కాలేదని వివరించారు. ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోందని, ఏపీకి మూడు రాజధానులు అసాధ్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఒకచోట, హైకోర్టు మరోచోట, అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంకో చోట ఏర్పాటు చేయడం వీలుకాదని అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని మించింది లేదని జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు.