ఈ ప్రేమకథతో ప్రేమలో పడిపోతారు... 'జాను' టీజర్ రిలీజ్

09-01-2020 Thu 20:57
  • శర్వానంద్, సమంత జంటగా 'జాను'
  • తమిళ సినిమాకు రీమేక్
  • సమంత అద్భుత నటన

తమిళంలో హిట్ అయిన '96' చిత్రానికి రీమేక్ గా వస్తున్న చిత్రం జాను. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. సోషల్ మీడియా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీజర్ పోస్టు చేసింది. ఈ ప్రేమకథ అద్భుతం, మీరు కూడా దీంతో ప్రేమలో పడిపోయేంత గొప్ప ప్రేమ కథ అంటూ క్యాప్షన్ పెట్టారు.

దిల్ రాజ్, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమారే దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఓ రేంజ్ లో చేసిందన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతోంది. తమిళంలో '96'లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.