తన భార్య బ్రాహ్మణిపై పోస్టు చూసి నిప్పులు చెరిగిన నారా లోకేశ్

09-01-2020 Thu 18:17
  • నారా లోకేశ్ పేరిట ట్విట్టర్ లో ఫేక్ పోస్టు
  • బ్రాహ్మణి ఖాతాలో అమ్మ ఒడి నగదు జమ అంటూ పోస్టు
  • జగన్ దొంగ బతుకు గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతానంటూ లోకేశ్ వార్నింగ్

అమ్మ ఒడి పథకం కింద తన సతీమణి నారా బ్రాహ్మణి ఖాతాలోనూ రూ.15,000 జమ చేసినందుకు తాను ధన్యవాదాలు చెబుతున్నట్టు సోషల్ మీడియాలో వెలిసిన పోస్టుపై నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అది ఫేక్ పోస్టు అని స్పష్టం చేశారు.

"మీ పిచ్చి డ్రామాలు నా దగ్గర కాదు... జగన్ ముందు వేసుకోండి. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిది. మార్ఫింగ్ చేసి తప్పుడు పనులు చేస్తే జగన్ దొంగ బతుకు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబడెతా" అంటూ ఘాటుగా హెచ్చరించారు. రేపు శుక్రవారం... అక్కడ కొట్టుకోండి మీ డప్పు అంటూ లోకేశ్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. ఐదు రూపాయల ముష్టి కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే జాలి కలుగుతోందని తెలిపారు.