ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల్లో మార్పు వచ్చే వరకూ మా పోరాటం ఆగదు: నాదెండ్ల మనోహర్

09-01-2020 Thu 17:49
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర
  • నిన్న బస్సుయాత్రను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం
  • రైతులకు జనసేన పార్టీ  అండగా ఉంటుంది

ప్రజల దృష్టిని మళ్లించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న అమరావతి పరిరక్షణ సమితి చేపట్టాలనుకున్న బస్సు యాత్రను అడ్డుకోవడాన్ని తమ పార్టీ ఖండిస్తున్నట్టు చెప్పారు.

 ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ నిర్ణయాల్లో మార్పు వచ్చే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులకు జనసేన పార్టీ  అండగా ఉంటుందని, రాబోయే వారం రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశంపై ఇప్పటికే చర్చించుకున్నామని చెప్పారు.