రాజధాని ఉద్యమం కోసం జోలె పట్టి విరాళాలు సేకరించిన చంద్రబాబు

09-01-2020 Thu 17:11
  • తీవ్ర రూపు దాల్చిన రాజధాని ఉద్యమం
  • మచిలీపట్నంలో ప్రజా చైతన్యయాత్ర
  • పాల్గొన్న చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ

ఏపీ రాజధాని ఉద్యమం మరోస్థాయికి చేరింది. రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు మచిలీపట్నంలో ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. స్థానిక కోనేరు సెంటర్ లో ఉన్న దుకాణాలు, షాపింగ్ మాల్స్ వద్ద చంద్రబాబు నిధులు సేకరించగా, చంద్రబాబు రాకతో అక్కడ కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజానీకం పాల్గొంది. మహిళలు, యువత రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ముక్తకంఠంతో నినదించారు.