Andhra Pradesh: కష్టాల్లో ఉన్న రైతుల కోసం అశ్రిత తన చెవిపోగులు ఇచ్చింది: నారా లోకేశ్

  • రైతుల దీక్షకు సంఘీభావం ప్రకటించిన లోకేశ్
  • రైతుల పోరాట స్ఫూర్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వ్యాఖ్యలు
  • జగన్ తుగ్లక్ నిర్ణయాలకు 11 మంది రైతులు బలయ్యారని ఆరోపణ

  రాజధాని అమరావతిలో రైతులు సాగిస్తున్న నిరసన దీక్షల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. తుళ్లూరు, మందడం గ్రామాల్లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఎంతోమంది తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారని, రైతుల పోరాటానికి మద్దతుగా అశ్రిత అనే అమ్మాయి తన చెవిపోగులు ఇచ్చిందని లోకేశ్ వెల్లడించారు. మండుటెండలో రైతులు పడుతున్న కష్టాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందని, రాజధాని రైతుల పోరాట స్ఫూర్తి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. జగన్ తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాలకు 11 మంది రైతులు బలయ్యారని, ఇంత జరుగుతున్నా రైతులు పండించిన అన్నం తింటూ వైసీపీ నేతలు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

More Telugu News