దూసుకుపోయిన మార్కెట్లు.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్

09-01-2020 Thu 15:43
  • 626 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 187 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతం వరకు లాభపడ్డ ఐసీఐసీఐ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. యుద్ధం చేయాలనే ఆలోచన తమకు లేదని అమెరికా, ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 626 పాయింట్లు లాభపడి 41,444కి పెరిగింది. నిఫ్టీ 187 పాయింట్లు పుంజుకుని 12,213 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.85%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.31%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.24%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.09%), మారుతి సుజుకీ (2.87%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.72%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.93%), ఎన్టీపీసీ (-0.63%), సన్ ఫార్మా (-0.02%).