శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబుల పేలుడు.. విద్యార్థులకు గాయాలు

09-01-2020 Thu 15:18
  • సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో ఘటన
  • పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటుండగా పేలిన బాంబులు
  • ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయలు.. ఒకరి పరిస్థితి విషమం

శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులోని పాఠశాల వద్ద రెండు నాటుబాంబులు పేలాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు విద్యార్థులు తిరుపతిరావు(12), రాజు(11)కు తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లిద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.