ఆలపాటి రాజాను అరెస్టు చేయడంపై గల్లా జయదేవ్ ఆగ్రహం

09-01-2020 Thu 14:57
  • శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే అరెస్టు చేస్తారా?
  • ఉద్యమాన్ని  బలహీనపరచాలని యత్నిస్తున్నారు
  • చట్టాన్ని  అతిక్రమిస్తే పోలీసులైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదు

అమరావతి రైతులకు మద్దతుగా ఈరోజు ఉదయం తెనాలి నుంచి పాదయాత్రకు ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఖండించారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రాజాను బలవంతంగా అరెస్టు చేయడం తగదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.