ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుంది విజయసాయిరెడ్డిగారూ?: బుద్ధా వెంకన్న

09-01-2020 Thu 13:01
  • రైతు రుణమాఫీ దండగ అని 2014లో జగన్ చెప్పారు
  • ఇప్పుడు రూ. 12,500 రైతుల భరోసా అని దగా చేస్తున్నారు
  • మూడు రాజధానులు అనేది బోగస్ అంశం

రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేయడం దండగ అని 2014లో జగన్ అన్నారని చెప్పారు. '2019లో రూ. 12,500 రైతుల భరోసా అని దగా చేశారు. ఇచ్చే రూ. 7,500 కూడా మూడు దశల్లో ఇస్తామని అంటున్నారు' అంటూ విమర్శించారు. రైతులు గోచీ కట్టుకుని బురదలో నిలబడి నోరు మూసుకుని ఉండాలని, నోరెత్తితే తాట తీస్తామని వైసీపీ నేతలతో జగన్ వార్నింగులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు అనేది బోగస్ అంశమని ఎద్దేవా చేశారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుంది విజయసాయిరెడ్డిగారూ? అని వెంకన్న ప్రశ్నించారు.