చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విశాఖలో టీడీపీ శ్రేణుల నిరసన

09-01-2020 Thu 12:31
  • మౌన దీక్ష చేపట్టిన నాయకులు, కార్యకర్తలు 
  • జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన 
  • రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శ

రాష్ట్రంలో వైసీపీ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారనేందుకు విపక్ష నేత చంద్రబాబు అరెస్టు నిదర్శనమని విశాఖ నగరానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యాఖ్యానించారు. 

నిన్న విజయవాడ బెంజిసర్కిల్ వద్ద చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు మౌన దీక్ష చేపట్టారు. నోటికి నల్లగుడ్డలు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబుతోపాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఈ ఆందోళనకు హాజరయ్యారు. అయితే ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరుకాకపోవడం గమనార్హం.