సినీ నటుడు పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టిన అమరావతి రైతులు

09-01-2020 Thu 12:14
  • రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్న పృథ్వీరాజ్
  • దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించిన రైతులు 
  • అడ్డుకున్న పోలీసులు

సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. మందడంలో పృథ్వీరాజ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు రైతులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రైతులు నినాదాలు చేశారు.