రైతుల దీక్షకు దళిత సంఘాల సంఘీబావం

09-01-2020 Thu 12:03
  • కొనసాగుతున్న 'సేవ్ అమరావతి ' దీక్షలు 
  • రోడ్డు పైనే టెంట్ వేసి కొనసాగింపు 
  • శ్రమదానంతోనైనా రాజధాని నిర్మించుకుంటామని వెల్లడి

రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం తనవద్ద డబ్బులేదని ప్రకటిస్తే శ్రమదానం చేసైనా రాజధాని నిర్మించుకుంటామని మందడం, తుళ్లూరు, వెలగపూడి రైతులు ప్రకటించారు. అంతేతప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని మార్పును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రైతులు చేస్తున్న దీక్ష నేటితో 23వ రోజుకి చేరుకుంది. మందడం వద్ద రైతులు రోడ్డు పైనే టెంట్ వేసి దీక్ష కొనసాగిస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తుళ్లూరు ధర్నా చౌక్ లో నిరసనకారులకు దళిత సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. జాతీయ జెండా, మోదీ ఫ్లెక్సీలతో నిరసనకారులు ధర్నాలో పాల్గొన్నారు.