బీజేపీ ఎంపీని 6 గంటల సేపు నిర్బంధించిన విద్యార్థులు

09-01-2020 Thu 10:03
  • విశ్వభారతి యూనివర్శిటీలో ప్రసంగిస్తుండగా ఘటన
  • ఓ గదిలో నిర్బంధించిన విద్యార్థులు
  • ఇది ఎంత వరకు సబబని ప్రశ్నించిన ఎంపీ స్వపన్ దాస్ గుప్తా

బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. కోల్ కతాలో సీఏఏపై ఆయన ప్రసంగిస్తుండగా... అదే భవనంలో 6 గంటల పాటు విద్యార్థులు ఆయనను నిర్బంధించారు. విశ్వభారతి యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు ఈ చర్యకు ఒడిగట్టారు. సీఏఏపై ప్రసంగించడానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించకుండా కేవలం బీజేపీ ఎంపీని మాత్రమే ఆహ్వానించారంటూ వైస్ ఛాన్సలర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేపట్టారు.

ఈ ఘటనపై స్వపన్ దాస్ గుప్తా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, సమావేశం ప్రశాంతంగా కొనసాగుతున్న సమయంలో ఒక మూక దాడి చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విశ్వభారతిలో తాను ప్రసంగిస్తుండగా తనను ఓ గదిలో నిర్బంధించారని తెలిపారు.