9 మంది చనిపోయినా జగన్ కు చీమకుట్టినట్టు కూడా లేదు: కేఈ

09-01-2020 Thu 09:36
  • బస్సు యాత్రను చూసి జగన్ ఎందుకు భయపడుతున్నారు?
  • చంద్రబాబును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
  • ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలంతా నిరసన తెలపాలి

వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి తప్పుపట్టారు. బస్సు యాత్రను చూసి ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పాలనా వైఫల్యాలు బయటపడతాయనే భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంత రైతులు 9 మంది చనిపోయినా జగన్ కు చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.

బస్సు యాత్రను అడ్డుకోవడం దారుణమని, చంద్రబాబును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఇలానే వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ప్రజలంతా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.