విశాఖపట్టణంలో రాత్రికి రాత్రే మాయమైన ఎన్టీఆర్ విగ్రహం

09-01-2020 Thu 09:30
  • మధురవాడ మార్కెట్లో కనిపించకుండా పోయిన విగ్రహం
  • రాత్రికి రాత్రే పెకలించి తీసుకుపోయిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ

విశాఖపట్టణంలో రాత్రికి రాత్రే ఎన్టీఆర్ విగ్రహం ఒకటి మాయమైంది. మధురవాడ మార్కెట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు పెకలించి పట్టుకుపోయారు. విగ్రహం మాయం కావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.