Eluru: ఏలూరు లైంగిక దాడిని తీవ్రంగా పరిగణించిన ఏపీ సర్కారు!

  • మహిళపై సామూహిక అత్యాచారం
  • బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
  • నిందితులకు శిక్ష పడేలా చేస్తామని హామీ

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సామూహిక అత్యాచారానికి గురై, ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించామని, వారిని కఠినంగా శిక్షించి తీరుతామని అన్నారు.

కాగా, తన కుమారుడు అనారోగ్యంతో ఉండగా, మందుల కోసం వెళుతుంటే, బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన తెలిసిన వ్యక్తి, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి, మరికొందరిని పిలిపించి, గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత, పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News