తగ్గని ఇరాన్... బాగ్దాద్ గ్రీన్ జోన్ ను తాకిన రెండు రాకెట్లు!

09-01-2020 Thu 07:57
  • 24 గంటల వ్యవధిలో రెండో దాడి
  • భారీ శబ్దాలతో దద్దరిల్లిన గ్రీన్ జోన్
  • ఇరాక్ లో తీవ్ర ఆందోళన

ఇరాన్ తో శాంతినే కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అత్యంత పటిష్ఠమైన భద్రత, యూఎస్ తదితర దేశాల ఎంబసీలు ఉన్న గ్రీన్ జోన్ పై రెండు రాకెట్లను ఇరాన్ ప్రయోగించడం తీవ్ర కలకలాన్ని రేపింది. అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరిగిందని వార్తా సంస్థ ఏఎఫ్పీ ప్రకటించింది.

గ్రీన్ జోన్ లో భారీ శబ్దాలు వినిపించాయని, ఇరాక్ లోని సంకీర్ణ దళాల సైనిక స్థావరాలపై మిసైల్ దాడులు జరిగిన 24 గంటల తరువాత తాజా దాడి జరిగిందని పేర్కొంది. తాజా దాడులు కూడా సులేమానీ హత్యకు ప్రతీకారంగా జరిగినవేనని సమాచారం. ఈ ఘటనతో ఇరాక్ లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.