శాంతంగా ఉంటే కావాలనే రెచ్చగొడుతున్నారు: పవన్ కల్యాణ్

09-01-2020 Thu 06:38
  • అమరావతి ప్రాంతంలో శాంతియుత నిరసనలు
  • ఉద్యమం ఉద్ధృతమయ్యే ప్రమాదముంది
  • పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేస్తున్నారని మండిపాటు

అమరావతి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను ఈ ప్రభుత్వం కావాలనే రెచ్చగొడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, పోలీసు బలంతో రైతుల ఉద్యమాన్ని అణచి వేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని అరోపించారు. ఇటువంటి చర్యలతో ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నిర్బంధం, అరెస్ట్ లతో ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే, ఉద్యమం ఉద్ధృతం అవుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఉద్యమ అణచివేతలో భాగంగానే నిన్న చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు.