జగన్ కీలక నిర్ణయం.. రేపు సీబీఐ కోర్టుకు హాజరు!

09-01-2020 Thu 06:31
  • అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం
  • మినహాయింపు కోరుతూ కోర్టుకు గైర్హాజరు
  • తప్పకుండా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు నాంపల్లి లోని సీబీఐ కోర్టుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత గత కొన్ని వాయిదాలకు హాజరు కాలేదు. వివిధ కారణాలు చూపుతూ కోర్టు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు.

అయితే, గతవారం జరిగిన విచారణలో జగన్  తప్పకుండా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విచారణకు తాను వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.