తెలంగాణలో తగ్గిన సంక్రాంతి సెలవులు!

09-01-2020 Thu 06:28
  • 12వ తేదీ నుంచి మొదలు
  • ఐదు రోజులు మాత్రమే సెలవు
  • ఒక రోజుతగ్గిస్తూ ఉత్తర్వులు జారీ

తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఒక రోజు తగ్గాయి. వాస్తవానికి ఈ నెల 11 నుంచి 16 వరకూ ఉండాల్సిన సెలవులు 12వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత సంవత్సరం జరిగిన ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ సెలవులను భర్తీ చేసుకునేందుకు ఏప్రిల్ వరకూ ప్రతి నెలా రెండో శనివారాన్ని పనిదినంగా పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.

11న రెండో శనివారం ఉన్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులు 12వ తేదీ నుంచి మొదలవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 8, మార్చి 14, ఏప్రిల్ 11న కూడా పాఠశాలలు పనిచేస్తాయని అన్నారు. కాగా, ఇంటర్‌ కాలేజీలకు ఈ నెల 13 నుంచి15 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ ఉమర్‌ జలీల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.