భారీ భద్రత మధ్య యాదాద్రి చేరుకున్న బంగారు కలశాలు!

09-01-2020 Thu 06:25
  • ప్రత్యేక కంటెయినర్ లో చెన్నై నుంచి తరలింపు
  • త్వరలోనే రాజగోపురాలకు కొత్త శోభ
  • మిగతా పనులు త్వరలో పూర్తి

యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మితమవుతున్న లక్ష్మీ నరసింహుని ఆలయంలో వివిధ గోపురాలపై ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన 56 బంగారు తాపడం కలశాలను భారీ భద్రత మధ్య యాదాద్రికి చేర్చారు. చెన్నై నుంచి వీటిని ప్రత్యేక కంటెయినర్ లో యాదాద్రికి తీసుకుని వచ్చారు. వీటిని ప్రస్తుతం పోలీసు కాపలా నడుమ భద్రపరచగా, త్వరలోనే వీటిని రాజగోపురాలపై అమర్చనున్నారు. ఆలయంలోని ధ్వజస్తంభం, విమాన గోపురం, తామ్ర కలశాలు, సుదర్శన చక్రాల బంగారు తాపడం కూడా అతి త్వరలో పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.