బీహార్ వసతి గృహాల్లో అత్యాచారాల కేసులో సీబీఐ కొత్త ట్విస్ట్

08-01-2020 Wed 22:01
  • ఆ 35 మంది బాలికలు చనిపోలేదని నివేదిక
  • ఓ వ‌స‌తి గృహం నుంచి ఇద్ద‌రి అస్థిపంజ‌రాల‌ను సేక‌రించాం
  •  మైనర్ అమ్మాయిల‌కు సంబంధించిన ఆధారాలు దొరకలేదు

బీహార్‌లోని వ‌స‌తి గృహాల్లో జరిగిన అత్యాచారాల కేసులో సీబీఐ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఈ కేసులో 11 మంది బాలికలు చనిపోవడానికి కారణం బ్రజేష్ ఠాకూర్ అనే వ్యక్తి అని చెప్పిన సీబీఐ తాజా నివేదికలో అత్యాచారానికి గురైన బాలికలెవరూ చనిపోలేదని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. రాజ‌కీయ నాయ‌కుల‌తో లింకు ఉన్న బ్ర‌జేశ్ ఠాకూర్ అనే వ్య‌క్తి వ‌స‌తి గృహాల్లో బాలిక‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డి ఉంటార‌ని గ‌త ఏడాది సీబీఐ త‌న నివేదిక‌లో తెలిపిన విషయం తెలిసిందే.

బీహార్‌లోని వ‌స‌తి గృహాల్లో సుమారు 35 మంది బాలిక‌లను అత్యాచారం చేసి చంపిన ఘ‌ట‌న‌పై సీబీఐ విచారణ పూర్తి చేసింది. మొత్తం 17 షెల్ట‌ర్ హోమ్స్‌పై విచార‌ణ జ‌రిపామని, నాలుగు కేసుల్లో 13 చార్జ్‌షీట్లు దాఖ‌లు చేసిన‌ట్లు సీబీఐ నివేదికలో పేర్కొంది. ముజ‌ఫ‌ర్‌ఫూర్‌లోని ఓ వ‌స‌తి గృహం నుంచి కేవ‌లం ఇద్ద‌రి అస్థిపంజ‌రాల‌ను సేక‌రించామ‌ని తెలిపింది. మైనర్ అమ్మాయిల‌కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించ‌లేద‌ని సీబీఐ వెల్ల‌డించింది. ఈ నేపథ్యంలో సీబీఐ తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ కెకె. వేణుగోపాల్.. చనిపోయిన‌ట్లు భావించిన బాలిక‌లు బ్ర‌తికే ఉన్నార‌ని తెలిపారు.