ప్రతిపక్ష నేత పోలీసులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు: ఏపీ హోంమంత్రి సుచరిత

08-01-2020 Wed 22:00
  • రాష్ట్రంలో ఆందోళనలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం
  • సహజ మరణాలను రాజధాని మరణాలంటున్నారని ఆరోపణ
  • శవరాజకీయాలు ఎంతవరకు సమంజసం అంటూ మండిపాటు

జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికలపై చర్చిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో సహజ మరణాలను కూడా రాజధాని కోసం మరణించారని చెబుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. శవరాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇక్కడివాళ్లకేదో అన్యాయం జరిగిపోతోందంటూ గందరగోళం చేస్తున్నారని, ప్రతిపక్ష నేత శాంతిభద్రతల సమస్య తీసుకువచ్చి పోలీసులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.