చిరంజీవిగారు ఓకే చెబితే ఎగిరి గంతేస్తాను: దర్శకుడు అనిల్ రావిపూడి

08-01-2020 Wed 18:29
  • ఇది నేను చేసుకున్న అదృష్టం 
  • నేను ఎప్పటికీ మరిచిపోలేను
  • మూడు నెలలలో కథను సిద్ధం చేస్తానన్న అనిల్ రావిపూడి 

విభిన్నమైన కథలను ఎంచుకోవడం .. వినోదభరితంగా తెరకెక్కించడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ నెల 11వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిగారు రావడం నా అదృష్టం. నా గురించి ఆయన మాట్లాడిన నాలుగు మాటలు నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయనతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అలాగే ఆయనతో సినిమా చేయాలని నాకూ వుంది. ఆ అవకాశం సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకుంటున్నాను. చిరంజీవిగారు ఓకే చెబితే ఎగిరిగంతేస్తాను. మూడు నెలలలో మంచి కథను సిద్ధం చేస్తాను" అన్నాడు. ఆయన ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి.