మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం: బీజేపీ ఎంపీ బండి సంజయ్ హెచ్చరిక

08-01-2020 Wed 17:42
  • గుంటూరులో, తెనాలిలో మనలాగే దేశభక్తులు ర్యాలీ చేశారు
  • కొంతమంది దేశద్రోహులు రాళ్ల దాడి చేశారు
  • యుద్ధం మొదలైంది.. ఎవరినీ వదిలిపెట్టం

సీఏఏకు అనుకూలంగా వరంగల్ లో నిర్వహించిన సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తనకు అందించిన ఓ కాగితంలో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ‘గుంటూరులో, తెనాలిలో మన లెక్కే దేశభక్తులు ర్యాలీ చేశారు. కొంతమంది దేశద్రోహులు రాళ్ల దాడి చేశారట’ అని అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

‘భయపడతామా అన్న! నా.. మీరు (దేశద్రోహులు) రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం. కట్టెలు పడితే, మేము కత్తులు పడతాం. రాకెట్ పడితే మేము లాంచర్ పట్టి కొడతాం. యుద్ధం మొదలైంది.. ఎవరినీ వదిలిపెట్టం’ అంటూ హెచ్చరించారు.

‘ఇవాళ యుద్ధం ప్రారంభించాం ఇక్కడి నుంచి. నిజాం వారసులై పచ్చజెండా పట్టుకుని వాళ్లొస్తే.. ఛత్రపతి శివాజీ వారసులమై, వీర సావర్కర్ వారసులమై, భగత్ సింగ్ వారసులమై.. ‘భారత్ మాతాకీ జై’ అంటూ యుద్ధం ప్రారంభించాం. ఈ యుద్ధంలో దేనికైనా సిద్ధమే’ అంటూ సంజయ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.