తెలుగు తెరకి త్వరలో నా కూతురిని పరిచయం చేస్తాను: సీనియర్ హీరో అర్జున్

08-01-2020 Wed 17:02
  • తెలుగులో అందుకే గ్యాప్ వచ్చింది 
  • ఒకప్పుడు ఒక సినిమా నెలలో పూర్తయ్యేది
  • తెలుగు మూవీకి దర్శకత్వం వహిస్తానన్న అర్జున్ 

యాక్షన్ కింగ్ గా తెలుగు .. తమిళ భాషల్లో అర్జున్ కి మంచి క్రేజ్ వుంది. యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేసే అర్జున్ కి కథ .. స్క్రీన్ ప్లే .. దర్శకత్వంపై మంచి పట్టు వుంది. ఆయన కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు కూడా.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "వీలును బట్టి నేను తెలుగు .. తమిళ .. కన్నడ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఒకప్పుడు ఒక సినిమా నెల రోజుల్లో పూర్తయ్యేది. ఇప్పుడు 3 నెలలకి పైగా సమయం పడుతోంది. అందువలన గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. మా అమ్మాయి 'ఐశ్వర్య' తమిళంలో విశాల్ జోడీగా చేసింది. తనని కన్నడ చిత్ర పరిశ్రమకి నా దర్శకత్వంలోనే పరిచయం చేశాను. ఈ ఏడాది తనని తెలుగు తెరకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. తను హీరోయిన్ గా నా దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.