Amaravati: కృష్ణాయపాలెం రైతుకు నివాళి.. శవపేటిక మోసిన నారా లోకేశ్

  • కృపానందం మృతదేహానికి నివాళులర్పించిన లోకేశ్
  • కుటుంబానికి పరామర్శ
  • అంత్యక్రియలు ముగిసే వరకు ఉన్న లోకేశ్

రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో మృతి చెందిన రైతు కృపానందం కుటుంబాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. కృపానందం మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని, కృపానందం శవపేటికను లోకేశ్ మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు.

 సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు

రాజధానిని తరలిస్తున్నారన్న ఆవేదనతోనే కృపానందం మృతి చెందారని లోకేశ్ ఆరోపించారు. ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు పదిమంది రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేసిన జగన్, ఇప్పుడు, రైతుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజధాని తరలిపోకుండా సీఎం జగన్ పై ఒత్తిడి తేవాల్సిన గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండటం తగదని, వారికి సిగ్గూశరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News