గురుదక్షిణలో భాగంగానే జగన్ ఇదంతా చేస్తున్నారు: యనమల

08-01-2020 Wed 16:39
  • స్వరూపానంద శాసనమే జగన్ కు ఎక్కువ
  • రాజ్యాంగం కన్నా శారదా పీఠమే ఆయనకు ముఖ్యం
  • కేసీఆర్, జగన్, స్వరూపానంద ముగ్గురూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు

ఏపీ పునర్విభజన చట్టం కంటే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద శాసనమే ముఖ్యమంత్రి జగన్ కు ఎక్కువని టీడీపీ సీనియర్ నేత యనమల విమర్శించారు. రాజ్యాంగం కన్నా శారదా పీఠమే ఎక్కువని మండిపడ్డారు. గురుదక్షిణగానే రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్, స్వరూపానంద ముగ్గురూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని అన్నారు.

కేసీఆర్ ను ఏ పరిస్థితుల్లో జగన్ కలవబోతున్నారో (13వ తేదీన) ప్రజలంతా అర్థం చేసుకోవాలని యనమల కోరారు. వీరి భేటీ రాష్ట్రానికి మరింత నష్టం చేస్తుందని అన్నారు. సొంత రాష్ట్రానికి వీలైనంత నష్టం చేయడం, పక్క రాష్ట్రాలకు చేతనైనంత మేలు చేయడమే జగన్ విధానమని దుయ్యబట్టారు. అమరావతి రాజధాని అనే నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిందని చెప్పారు.