కేరళలో బన్నీకున్న క్రేజ్ అలాంటిది!

08-01-2020 Wed 16:28
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'అల వైకుంఠపురములో'
  • కేరళలో 30 స్క్రీన్లలో ఎర్లీ మార్నింగ్ షోలు 
  • ఈ నెల 12వ తేదీన భారీ విడుదల

కేరళలో అత్యధిక ఫాలోయింగ్ వున్న తెలుగు యువ కథానాయకుల జాబితాలో బన్నీ ముందుగా కనిపిస్తాడు. కేరళలో బన్నీకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆయన సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ వుంది. అందువలన బన్నీ తన ప్రతి సినిమాను కేరళలోను విడుదలయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. తెలుగులో యావరేజ్ గా ఆడిన ఆయన సినిమాలు అక్కడ భారీ వసూళ్లను సాధించిన సందర్భాలు వున్నాయి.

ఆయన తాజా చిత్రమైన 'అల వైకుంఠపురములో' సినిమాను కూడా కేరళలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఈ సినిమాకి ఎర్లీ మార్నింగ్ షోలు వేయనున్నారు. కేరళలో 30 స్క్రీన్లలో ఎర్లీ మార్నింగ్ షోలు పడుతుండటం విశేషం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయట. ఈ నెల 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది.