తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో.. స్వతంత్ర అభ్యర్థులుగా జనసేన అభ్యర్థులు!

08-01-2020 Wed 15:35
  • ప్రత్యేక పరిస్థితుల వల్ల పార్టీ గుర్తుతో పోటీ చేయడం లేదు
  • పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుంది
  • జనసేన ప్రెస్ నోట్ లో వెల్లడి

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే తమ అభ్యర్థులు పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీచేయడం లేదన్నారు. ఈ మేరకు వివరాలతో జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో పోటీచేయడం లేదని వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొంటూ.. ఆసక్తి ఉన్న వారు స్వంతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని సూచించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీనికి అనుమతినిచ్చారని తెలిపింది.