సీఎం కేసీఆర్ పై వీహెచ్ తీవ్ర ఆరోపణలు

08-01-2020 Wed 15:33
  • కేసీఆర్ కు ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే డబ్బులు సరిపోవట్లేదా?
  • క్రీడా శాఖ నుంచి వసూలు చేస్తున్నారు?
  • మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే క్రీడా రంగానికి అన్ని సదుపాయాలు కల్పిస్తాం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కు ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే డబ్బులు సరిపోక క్రీడా శాఖ నుంచి కూడా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి వీహెచ్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ కనుక గెలిస్తే క్రీడలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ గురించి ప్రస్తావించారు. ఇది నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చిన పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.