'జాను' నుంచి ఫస్టు టీజర్ వచ్చేస్తోంది

08-01-2020 Wed 15:16
  • '96' రీమేక్ గా 'జాను'
  • రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ రిలీజ్ 
  • సంగీత దర్శకుడిగా గోవింద్ వసంత

సమంత - శర్వానంద్ జంటగా 'జాను' సినిమా నిర్మితమైంది. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన '96' సినిమాకి రీమేక్. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి .. త్రిష నటించిన ఆ సినిమా అక్కడ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దాంతో ఈ సినిమాను అదే దర్శకుడితో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. '96' సినిమాకి బాణీలను అందించిన 'గోవింద్ వసంత'నే ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇటు సమంత .. అటు శర్వానంద్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకంతో వున్నారు.